ఢిల్లీలో జగన్ ను కలిసిన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి

  • పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఆమ్రపాలి
  • ఢిల్లీలోని జగన్ నివాసంలో భేటీ
  • ఏపీ కేడర్ నుంచి తెలంగాణ కేడర్ కు మారిన ఆమ్రపాలి
ప్రధాని మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఆమ్రపాలి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుసుకున్నారు. ఢిల్లీలోని జగన్ నివాసానికి వెళ్లి, ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఆమ్రపాలి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి. అయితే ఆమె ఏపీ నుంచి తెలంగాణ కేడర్ కు మారారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
 

Amrapali
IAS
Jagan
YSRCP

More Telugu News